News July 12, 2024

టియు: పీజీ పరీక్షలు వాయిదా..

image

టియు & అనుబంధ కళాశాలలో ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే పీజీ IV సెమిస్టర్ పరీక్షలు డిఎస్సీ, గ్రూప్-2 పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏపిఈ, ఐపిసిహెచ్, ఐఎంబీఏ, రెగ్యులర్, బ్యాక్లాగ్, ఎంబీఏ, ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 14, 2025

సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

image

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

News December 14, 2025

నిజామాబాద్: సర్పంచ్‌గా తొలి విజయం మహిళదే

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మోపాల్ మండలం శ్రీరాంనగర్‌తండా సర్పంచ్‌గా గుగులోత్ సరోజ 84 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బస్సీ సునీతపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఉపసర్పంచ్ ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు.

News December 14, 2025

నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.