News April 4, 2024

టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ నరేష్ రెడ్డి

image

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSSET) మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రం అందజేశారు. 2023లో టీఎస్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. అయితే 2024లో మళ్లీ టీఎస్ సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెంబర్ సెక్రటరీని నియమించారు.

Similar News

News December 14, 2025

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 886 మంది దొరికారు!

image

నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హైదరాబాద్-సైబరాబాద్‌ పోలీసులు ఆయా కమిషనరేట్ల పరిధిలో వీకెండ్ డ్రంక్&డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో HYD-460, CYB-426 మంది పట్టుబడ్డారు. వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పట్టుబడ్డ మందుబాబుల మీద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చనున్నట్లు స్పష్టం చేశారు. మద్యం తాగి రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 14, 2025

HYD: అరుదైన దృశ్యం.. ఇంటిపై ఇలవేల్పు!

image

మేడ్చల్ జిల్లా రాంపల్లిలో కులవృత్తి గౌరవాన్ని చాటిచెప్పే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎలిజాల మహేశ్ గౌడ్ తన ఇంటి ఎలివేషన్‌పై తాటి చెట్టెక్కుతున్నట్లు.. కల్లు పోస్తున్నట్లు సంప్రదాయ దృశ్యాలతో కళాత్మకంగా అలంకరించారు. వృత్తి సంస్కృతిని తరతరాలకు గుర్తు చేసేలా రూపొందిన ఈ అలంకరణ స్థానికులను ఆకట్టుకుంటోంది. కులవృత్తి పట్ల గుర్తింపును చాటే ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.

News December 14, 2025

SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

image

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.