News February 21, 2025

టీచర్‌గా మారిన కలెక్టర్.. తాను చెబుతూ పిల్లలతో చెప్పిస్తూ..

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టీచర్‌గా మారారు. విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బోధించారు. విద్యార్థులతో పాఠాలు బోధించేలా చేశారు. వారితో మమేకమై పోయారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహ భోజనం చేశారు. ఈ పరిణామం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎల్లారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఈ సంఘటన గురువారం జరిగింది.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన MIM మద్దతు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 16 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నిక కలిసి వచ్చింది. కాగా ఈసారి కాంగ్రెస్‌కు అటు MIMతో పాటు TJS, CPI, CPM సహా పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మద్దతు కూడగట్టడంలో CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యహరించడంతో ఆ పార్టీలు ఉపఎన్నికలో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశాయి. దీంతో అత్యధిక మెజార్టీతో హస్తం పార్టీ విజయం సాధించింది.

News November 14, 2025

డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్‌రెడ్డి

image

TG: దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.

News November 14, 2025

ఫలించని రాహుల్ యాత్ర.. అన్నింటా వెనుకంజ!

image

‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ఇటీవల బిహార్‌లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోటా కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్‌లో ఉండటం గమనార్హం.