News July 10, 2024

టీచర్‌గా మారిన నారాయణపేట కలెక్టర్

image

నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీచర్‌గా మారి 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. నారాయణపేట మండలం జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News October 14, 2024

MBNR: దసరాకు ఫుల్లుగా దావత్.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం పెరిగింది. ఉమ్మడి జిల్లాల్లో 230 మద్యం దుకాణాలు ఉండగా..రూ.80.14 కోట్ల విక్రయాలు జరిగాయి. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉంచుతుండటంతో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం లభిస్తుంది. పండగకు సొంతూరు వచ్చిన బంధువులు, మిత్రులతో కలిసి జోరుగా దావత్లు చేసుకున్నారు. బీరు, విస్కీ అమ్మకాలు అధికంగా జరిగాయి.

News October 14, 2024

MBNR: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ

image

దసరా సెలవులు ముగియడంతో తిరిగి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉ.4 గంటల నుంచి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు సవాల్‌గా మారింది. MBNR, NGKL, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపాలని కోరుతున్నారు.

News October 14, 2024

వనపర్తి: నేడు కలెక్టర్ ఆఫీస్‌లో ప్రజావాణి రద్దు

image

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఐడిఓసి భవనంలో నేడు జరగనున్న ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో దిశా సమావేశం ఉన్నదని ఈ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తామన్నారు. ప్రజలు వ్యయ ప్రయాసలకు వచ్చి రేపు దరఖాస్తులు తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి రావొద్దని కోరారు.