News March 4, 2025

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే!

image

➤శ్రీపాల్‌రెడ్డి-13969 (గెలుపు), ➤అలుగుబెల్లి నర్సిరెడ్డి- 8448, ➤హర్షవర్ధన్ రెడ్డి-6034, ➤పూల రవీందర్- 3992, ➤సర్వోత్తంరెడ్డి-2645, ➤సుందర్‌రాజ్-2141, ➤వెంకటస్వామి-439, ➤బాబురావు-132, ➤శంకర్-120, ➤ఏలే చంద్రమోహన్-102, ➤వెంకటయ్య-39, ➤జంగిటి కైలాసం-26, ➤పన్నాల గోపాల్‌రెడ్డి-24, ➤అర్వ స్వాతి-20. ➤లింగిడి వెంటేశ్వర్లు-15. ➤పురుషోత్తంరెడ్డి-11. ➤రాజు-7. ➤సాయన్న-5. ➤చలిక చంద్రశేకర్-1. ➤ఇన్ వ్యాలీడ్-9672

Similar News

News March 30, 2026

మెదక్: మోసాలపై 1930కు ఫిర్యాదు చేయండి: ఎస్పీ

image

మెదక్ జిల్లా జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ పెండింగ్ కేసులు రాజీ ద్వారా పరిష్కరించారు. మొత్తం 485 ఐపీసీ & BNS కేసులు, 86 సైబర్ క్రైమ్, 90 ఈ-పెట్టి, 527 డీడీ&ఎంవీ యాక్ట్ కేసుల్లో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. సైబర్ మోసాల్లో కోల్పోయిన ₹27.57 లక్షలను 86 కేసుల్లో బాధితులకు తిరిగి అందించారు. ఎస్పీ సిబ్బందిని అభినందిస్తూ, సైబర్ మోసాలకు 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 30, 2026

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు (2/2)

image

వేసవి రద్దీని నియంత్రించేందుకు దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. భువనేశ్వర్- యశ్వంత్ పూర్ వీక్లీ(02811/02812) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం నడపనున్నారు. బెంగళూరు- మాల్దా వీక్లీ(06565/06566) ఏప్రిల్ 5 నుంచి జులై 12 వరకు ప్రతి ఆదివారం, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 8 నుంచి జులై 15 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు.

News March 30, 2026

నేడు 2.50లక్షల మందికి ఇళ్ల పంపిణీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించనుంది. తిరుపతి జిల్లా పుదూరులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని గృహప్రవేశాలు చేయించనున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 5.50లక్షలకు చేరనుందని ప్రభుత్వం తెలిపింది. 2025 నవంబరు 12న తొలి విడత కింద 3లక్షల ఇళ్లను అందించింది.