News March 1, 2025
టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.
Similar News
News March 1, 2025
పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలి: హైకోర్టు

TG: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరట దక్కింది. 16 ఏళ్ల లోపు పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. మరోవైపు తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
News March 1, 2025
నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు: హోంమంత్రి

AP: కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని, YCPలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ క్షమించరని చెప్పారు. తాము రెడ్‌బుక్ ప్రకారం ముందుకెళ్తే YCP నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
News March 1, 2025
గొలుగొండ: మేడ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. సీహెచ్.నాగపురం గ్రామానికి చెందిన మరిసా కృష్ణ ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.