News December 2, 2025
టీజీ అప్డేట్స్

* ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటికే 152 బస్సులు అందజేత
* రేపు లేదా ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో రామగుండం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) టీమ్.
* ఈ నెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్. పూర్తి వివరాలకు <
Similar News
News April 6, 2026
నిత్యావసర సరకుల ధరల్లో మార్పులు లేవు: కేంద్రం

దేశంలోని నిత్యావసర సరకుల ధరలు, LPG లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఉల్లి, టమాటా, ఆలుగడ్డ ధరలు స్థిరంగా ఉన్నాయని.. గోధుమ, బియ్యం ధరల్లోనూ మార్పులేదని తెలిపింది. బఫర్ స్టాక్స్ తగినంతగా ఉన్నాయని పేర్కొంది. ముడి చమురు, LPG సరఫరా సమృద్ధిగా ఉందని, కొరత ఉందనే వదంతులను నమ్మవద్దని సూచించింది. బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
News April 6, 2026
‘కుంభకర్ణుడి నిద్ర’కు కారణమేంటి?

ఎప్పుడూ నిద్రపోతూ, ఎంత పిలిచినా లేవని వాళ్లను కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావని అంటాం. బలవంతుడైన కుంభకర్ణుడు ఇంద్రాసనం పొందడానికి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తారు. ఇది ప్రమాదమని గ్రహించిన సరస్వతి అతని నాలుకపై చేరి నిద్రాసనం కోరుకొనేలా చేస్తారు. తర్వాత కుంభకర్ణుడి వినతి మేరకు 6 నెలలు నిద్ర, ఓరోజు మెలకువగా వరాన్ని బ్రహ్మ సవరిస్తారు.
* మీకు తెలిసి కుంభకర్ణుడిలా నిద్రపోయేవారెవరైనా ఉన్నారా?
<<-se>>#EPICSAYINGS<<>>
News April 6, 2026
ధోనీకి 2 రోజుల్లో ఫిట్‌నెస్ టెస్ట్?

CSK మాజీ కెప్టెన్ ధోనీ IPLలో త్వరలోనే ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2 రోజుల్లో ఆయనకు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారని CSK క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందులో పాస్ అయితే ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారంటున్నాయి. ఫిట్‌నెస్ లేక IPLకు రెండు వారాల పాటు ధోనీ దూరమవుతారని జట్టు యాజమాన్యం చెప్పిన విషయం తెలిసిందే. కాగా CSK ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది.


