News December 27, 2024

టీజీ భరత్ కుమార్తె పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్యపాన్య వివాహ వేడుక హైదరాబాదులోని GMR అరేనలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ హాజరై సందడి చేశారు. నూతన వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు బాలయ్యతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Similar News

News December 27, 2024

వైసీపీకి ఇంతియాజ్ రాజీనామా

image

విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News December 27, 2024

కర్నూలు: 58వ సారి రక్తదానం

image

కర్నూలులోని ఓ ఆసుపత్రిలో హనుమంతు అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీని సంప్రదించారు. ఆ సొసైటీ అధ్యక్షుడు గందాలం మణికుమార్ స్పందించారు. 58వ సారి ఆయన రక్తదానం చేశారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు. 

News December 27, 2024

శ్రీశైలంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కోరారు. శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ సిఫార్సు లేఖలను తిరుమలలో యాక్సెప్ట్ చేయాలి. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. TTD తరఫున తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అని సురేఖ కోరారు.