News February 21, 2025
టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన సాథీ మినీ ట్రక్కును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ మోహన్ రాజుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 23, 2025
ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్

స్విగ్గీలో ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ ఐటమ్‌గా బిర్యానీ నిలిచింది. వరుసగా 10th ఇయర్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. భోజన ప్రియులు ఈ ఏడాది 93 మిలియన్ బిర్యానీలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తన ఇయర్ ఎండ్ రిపోర్టులో పేర్కొంది. కాగా మోస్ట్ ఆర్డర్డ్ లిస్టులో బర్గర్స్ (44.2M), పిజ్జా (40.1M), వెజ్ దోశ (26.2M) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
News December 23, 2025
సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

పర్యాటకుల సౌకర్యార్థం ఈనెల 29, 30 తేదీల్లో సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు RTC DM ప్రకాష్‌రావు తెలిపారు. మురుడేశ్వర్, గోకర్ణ, గోవా సందర్శనకు 2 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.2,800 చార్జీగా నిర్ణయించామని, ఈనెల 29న మ.12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 23, 2025
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. ’10వ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి. వెనుకబడిన జుక్కల్ మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. DEO రాజు పాల్గొన్నారు.


