News April 12, 2025
టీటీడీ కోటి విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1 కోటిని వైజాగ్‌కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్‌ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు.
Similar News
News March 6, 2026
మహబూబాబాద్ డిపోలో రేపు డయల్ యువర్ డీఎం: మేనేజర్

మహబూబాబాద్ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వి.కళ్యాణి ప్రకటనలో తెలిపారు. ఉ.11 నుంచి మ.12 గంటల వరకు 8500324880 నెంబర్‌కు కాల్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులను కోరారు. డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 6, 2026
ఫెనాల్టీ, వడ్డీని ఎత్తివేయాలి : రైస్ మిల్లర్స్ అసోసియేషన్

డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై విధించిన 25%ఫెనాల్టీ, 12%వడ్డీని వెంటనే ఎత్తివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. అధికారుల ఒత్తిడి, అరెస్టు చేస్తారనే భయంతో కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో రైస్ మిల్లు యజమాని స్వప్న ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మావోయిస్టులకు కోట్ల రూపాయల పునరావాసం ఇస్తున్న ప్రభుత్వం రైస్ మిల్లర్లపై కనికరం చూపకపోవడం దారుణమన్నారు.
News March 6, 2026
ADB: రైతు భరోసా ఇంకెప్పుడు?

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కోసం రైతాంగం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తోంది. 2025-26 గాను ప్రభుత్వం కేవలం ఖరీఫ్ సాయం మాత్రమే అందించింది. రబీ సీజన్‌కు సంబంధించి గత OCTలోనే నిధులు విడుదల కావాల్సి ఉన్నా నేటికీ అతీగతీ లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.83 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ADB 4.85, NRML 4.23, MNCL 2.46, ASF 3.25తో కలిపి మొత్తం సుమారు 14.79 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతున్నాయి.


