News September 14, 2025

టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన తిరపతి కొత్త SP

image

తిరుమలలో ఆదివారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును నూతన ఎస్పీ సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని బీఆర్ నాయుడు SP సుబ్బారాయుడుకు సూచించారు. అనంతరం ఆయన్ను అభినందిస్తూ రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.

Similar News

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో నంద్యాల MPకి 11వ ర్యాక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో నంద్యాల MP బైరెడ్డి శబరి 11వ స్థానంలో నిలిచారు. ఆమె లోక్‌సభలో మొత్తం ప్రశ్నలు 78 అడగగా, 09 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆమె హాజరు శాతం 82.35గా ఉంది. మరి MP పని తీరుపై మీ కామెంట్..!

News September 14, 2025

ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ ప్రేమకథ.!

image

ప్రజలకు సేవా చేయాలన్న తపన వారిద్దరిది. IASకు ప్రయత్నించి ఒకరు మొదటి ప్రయత్నంలో, మరొకరు రెండో ప్రయత్నంలో సెలక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ల మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ హిమాన్షు శుక్లా-కృతికా శుక్లా ప్రేమ కథ. ప్రస్తుతం ఆమె పల్నాడు కలెక్టర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఇద్దరూ బాధ్యతలు చేపట్టారు.

News September 14, 2025

లోక్ అదాలత్‌లో 1,466 కేసులకు పరిష్కారం: కిరణ్ ఖరే

image

భూపాలపల్లి జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ అదాలత్‌లో మొత్తం 1,466 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమైనట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐపీసీ, బీఎన్‌ఎస్, సైబర్ క్రైమ్, డీడీ, ఎంవీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను పరిష్కరించామని ఎస్పీ తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమనే భావన ఉండాలని అన్నారు.