News July 10, 2025

టీటీడీ తొలి ఈవో ఎవరంటే?

image

చెలికాని అన్నారావు 1933లో తిరుమల ఆలయ పేష్కారుగా చేరారు. 1949లో కమిషనర్‌గా, 1951 నుంచి 1964 వరకు TTD తొలి ఈవోగా పని చేశారు. 1974 నుంచి 1979 వరకు తొలి TTD ఛైర్మన్‌గా శ్రీవారి సేవలో తరించారు. రేడియోల్లో స్వామివారి సుప్రభాత ప్రసారం, ఘాట్ రోడ్డు‌లో దేవస్థానం బస్సు, TTD విద్యాసంస్థలు, లెప్రర్సీ ఆసుపత్రి, ఎంప్లాయిస్ బ్యాంకు ఏర్పాటు చేశారు. వీటికి గుర్తుగా 2007లో తిరుపతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Similar News

News July 10, 2025

టెన్నిస్ ప్లేయర్ దారుణ హత్య

image

యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్‌(25)ను ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు. ఈ ఉ.10.30గంటలకు హరియాణా గురుగ్రామ్‌లోని ఇంట్లో రాధికపై ఆయన పలు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇన్‌స్టా రీల్స్ చేయొద్దని పలుమార్లు హెచ్చరించినా రాధిక వినకపోవడంతోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 10, 2025

26వ తేదీ లోగా డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 26 లోపు నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్‌స్టెంట్/ మేకప్ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా పరీక్షలను నిర్వహించి 26వ తేదీల్లోగా మార్కుల మెమోలను వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.

News July 10, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ.. కాసేపట్లో ఎన్నికలపై క్లారిటీ?

image

TG: సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ 3 గంటలుగా కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలులో పురోగతి, శాఖల పనితీరుపై చర్చిస్తున్నట్లు సమాచారం.