News September 9, 2025
టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు

రేపు జరగాల్సిన టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు అయింది. ఈఓ శ్యామలరావు బదిలీతో రేపు బోర్డు సమావేశంతో పాటు ఇవాళ జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం కూడా రద్దు అయింది. 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రీయను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు అదేశాలతో అర్హులైన బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా త్వరలో పారదర్శకంగా వేదపారాయణదారులు పోస్టులను భర్తీ చేయనున్నారు.
Similar News
News September 9, 2025
మునిపల్లి: లింగంపల్లి పాఠశాలలో ప్రమాదం

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి పాఠశాలలో పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. శివానంద్ (ఇంటర్ మొదటి సంవత్సరం) తలకు గాయం కాగా, జ్ఞానేశ్వర్ (10వ తరగతి), అరవింద్ (6వ తరగతి) కూడా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులకు జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News September 9, 2025
4 దశల్లో స్థానిక ఎన్నికలు: SEC

APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.