News September 20, 2025
టీటీడీ ప్రసాదాల తయారీకి సిక్కోలు ఆర్గానిక్ బెల్లం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నిమ్మతొర్లువాడ అనే చిన్న పల్లెటూరులో తయారయ్యే ఆర్గానిక్ బెల్లం చాలా ప్రత్యేకం. తిరుమల ప్రసాదాల తయారీలోనే కాదు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులకు కూడా దీనినే ఉపయోగిస్తున్నారు. టీటీడీ నాణ్యత ప్రమాణాలు తట్టుకొని ‘అగ్ మార్క్ ‘ సర్టిఫికేషన్ పొందిన ఈ బెల్లానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నామని ఇక్కడి తయారీదారులు చెబుతున్నారు.
Similar News
News September 20, 2025
శ్రీకాకుళం: కలెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరాంధ్ర జేఏసీ కోఆర్డినేటర్ కూన సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు నోటీసును అందజేశారు. రాజకీయ, పలు రకాల ఒత్తిడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. సచివాలయ వ్యవస్థను ద్వితీయ శ్రేణి వ్యవస్థగా చూడడం తగదన్నారు.
News September 20, 2025
పలాస: తక్షణ పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి

ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాలుపై తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని SP మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ఫిర్యాదు దారులుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ, ఆస్తి, పౌర సంబంధాలు, గొడవలు, మోసపూరితమైనవి, ఇతర అంశాలుపై ఫిర్యాదులు అందాయన్నారు.
News September 19, 2025
శ్రీకాకుళం: రామ్మోహన్ నాయుడును అభినందించిన లోకేశ్

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ <<17761800>>అభినందించారు<<>>. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్‌ను కేంద్ర మంత్రి దత్తతు తీసుకుంటానని వెల్లడించడంతో లోకేశ్ ఆయనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను వారి ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు దత్తతు తీసుకుంటే ఆదర్శంగా ఉంటారన్నారు.