News July 11, 2024
టీడీపీలోకి కుప్పం మునిసిపల్ ఛైర్మన్?
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన ఛైర్మన్, టీడీపీలో చేరేందుకే బయలుదేరి వెళ్లినట్లు కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో టీడీపీలో మునిసిపల్ ఛైర్మన్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 14, 2025
చంద్రగిరి: మంచి మనసు చాటుకున్న సీఎం
నారావారిపల్లెలో CM చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. CM వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుంచి వచ్చారు.. సమస్య ఏంటని అడిగారు. తన పేరు నాగరాజమ్మ (62), భర్త సుబ్బరామయ్య అని తెలిపారు. పక్షవాతంతో సుమారు 5 సం. నుంచి బాధపడుతున్నానని తెలిపారు. వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
News January 13, 2025
కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్
భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
News January 13, 2025
తిరుపతి: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కర్ణాటక రాయల్పాడు వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఢీకొనడంతో తిరుపతికి చెందిన ప్రకాశ్, కడపకు చెందిన టీచర్ మారుతి శివకుమార్ మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి కట్టకిందపాలెంకు చెందిన ప్రకాశ్ (55) అశోకనగర్లో ఉండే ఆనంద్‌తో కలిసి బెంగళూరు వెళ్లాడు. ఆదివారం వారు వస్తుండగా రాయల్పాడు వద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. టీచర్ మృతదేహాన్ని శ్రీనివాసపురానికి తరలించారు.