News March 25, 2024

టీడీపీలోకి కోవూరు ఎంపీపీ భర్త

image

కోవూరు మండల పరిషత్ అధ్యక్షురాలు పార్వతి భర్త చంద్ర తెలుగుదేశం పార్టీలో చేరారు. వేగూరుకు చెందిన చంద్ర ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.

Similar News

News March 13, 2025

15న కొండబిట్రగుంటకు రానున్న సింగర్ సత్యయామిని

image

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 గ్రాండ్‌గా మ్యూజికల్ నైట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సత్యయామిని సందడి చేయనున్నారు. ఆవిడతోపాటూ జబర్దస్త్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

News March 13, 2025

‘వికసిత భారత్ యూత్ పార్లమెంట్‌లో పాల్గొనండి’ 

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ 2025లో యువత అంతా పాల్గొనాలని కలెక్టర్ ఓ. ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం అందుకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. 18 నుంచి 25 సంవత్సరాలలోపు యువత అంతా దేశాభివృద్ధికి వేస్తున్న ప్రణాళికలో భాగస్వాములు కావాలని కోరారు. యువత యాప్‌లో రిజిస్టర్ చేసుకుని వారి షార్ట్ వీడియోలను భారత్ యాప్‌లో అప్లోడ్ చేసి దేశాభివృద్ధికి సహకరించాలని సూచించారు.

News March 12, 2025

స్వచ్ఛ ఆంధ్రలో అందరినీ భాగస్వాములు చేయండి: కలెక్టర్

image

ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందర్నీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రజల సంతృప్తి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

error: Content is protected !!