News October 16, 2025
టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే కొండేటి ప్రయత్నాలు?

పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చేరి ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకోవాలన్నదే ఆయన ప్లాన్ గా సమాచారం. టీడీపీ పెద్దలు చిట్టిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతుండగా.. ఆ పార్టీలోని ఎస్సీ నేతలు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు టీడీపీలో ఎంట్రీ జరిగేనా ? లేదా వేచి చూడాలి.
Similar News
News October 16, 2025
KNR: 30లక్షల క్వింటాళ్ల వరిధాన్యం సేకరణే లక్ష్యం

ఖరీఫ్ 2025-26 సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా ఈసారి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.
News October 16, 2025
డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.
News October 16, 2025
ములుగు: ఇంటి బాట పట్టిన అడవిలో అన్నలు!

ఆపరేషన్ కగారుతో అడవిలో అన్నలు ఇంటిబాట పడుతున్నారు. కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్ అడవులను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. దీంతో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు, అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో గురువారం అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో లొంగిపోగా, మరో నేత ఆశన్న 140 మందితో నేడో, రేపో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. దీంతో విప్లవ శకం ముగిసినట్లేనా అనే చర్చ మొదలైంది.