News December 21, 2025
టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తేజోవతి

టీడీపీ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతిని నేడు పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి టీడీపీలో చేరిన తేజోవతి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేయడంతో ఈ బాధ్యతను అప్పగించారు. తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణరావును పార్టీ అధిష్ఠానం నియమించింది.
Similar News
News December 24, 2025
జనవరి నుంచి చిత్తూరు మరింత చిన్నదాయే.!

జనవరి ఫస్ట్ వీక్‌లో మదనపల్లె జిల్లాను ప్రారంభించే అవకాశం ఉంది. CTR, అన్నమయ్య జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదట. దీంతో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెతోపాటూ పుంగనూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలతో కొత్త జిల్లా ఏర్పడనుంది. చిత్తూరు జిల్లా 32 మండలాల నుంచి 28కి పరిమితం కానుంది.
News December 24, 2025
పర్యాటక హబ్‌గా నంద్యాల జిల్లా

నంద్యాల జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News December 24, 2025
కర్నూలు SP కీలక నిర్ణయం

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.


