News December 21, 2025
టీడీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు వీరే..!

టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ(జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. కర్నూలు లోక్‌సభ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్‌ను నియమించారు. నంద్యాల లోక్‌సభ అధ్యక్షురాలిగా గౌరు చరితా రెడ్డి, ప్రధాక కార్యదర్శిగా ఎన్ఎండీ ఫిరోజ్‌ను నియమించారు.
Similar News
News December 26, 2025
కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు 940మంది రిజిస్ట్రేషన్

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివస్తుండగా 940 మంది రిజిస్ట్రేషన్ చేశారు. 27న ప్రారంభ సమావేశం, 28న పూర్వ విద్యార్థుల సమావేశం, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.
News December 26, 2025
హనుమకొండ: భార్య గొంతు కోసిన భర్త

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పరకాల మండలం మలకపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేస్తున్న మంద అనూష(35)ను ఆమె భర్త రవి కత్తితో గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది. అనూషను స్థానికులు హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
NRPT: అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బదిలీ

నారాయణపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా విధులు నిర్వహించిన సంచిత్ గంగ్వార్‌ను GHMC మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న నారాయణ్ అమిత్ మాలెంపాటిని నారాయణపేటకు బదిలీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ సెలవులో ఉండటంతో సంచిత్ గంగ్వార్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించారు.


