News April 30, 2024
టీడీపీ నుంచి మీసాల గీత సస్పెన్షన్

మాజీ MLA మీసాల గీతను TDP అధిష్ఠానం సస్పెండ్ చేసింది. విజయనగరం MLA సీటు ఆశించి భంగపడ్డ గీత ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినప్పటికీ ఆమె ఉపసంహరించుకోకపోవడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News April 21, 2025
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, 7 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆయన ఆదేశించారు. భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలు 2, మోసాలకు పాల్పడినవి 4, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
News April 21, 2025
విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్ డే

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
News April 21, 2025
తెట్టంగిలో బంగారం చోరీ

గుర్ల మండలంలోని తెట్టంగిలో ఐదున్నర తులాల బంగారం దొంగతనం అయినట్లు ఎస్సై పి.నారాయణ రావు సోమవారం తెలిపారు. తెట్టంగికి చెందిన జమ్ము పాపి నాయుడు ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని చెప్పారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో పూర్తి స్థాయిలో పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.