News April 30, 2024
టీడీపీ నుంచి సివేరి అబ్రహం సస్పెన్షన్

అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహంను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా.. అరకు సీటు ఆశించి భంగపడ్డ అబ్రహం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Similar News
News July 5, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2025
విశాఖ: 100% సబ్సిడీతో ట్రాన్స్‌పాండర్లు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోట్లకు ట్రాన్స్పాండర్లను ప్రభుత్వం అందజేసింది. 634 బోట్లకు 100% సబ్సిడీతో వీటిని సమకూర్చారు. వీటి ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను పర్యవేక్షించవచ్చు. సముద్రంలో బోట్లు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు. వర్షాకాలం కావడంతో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఉపయోగం ఎంతో ఉందని బోట్ల యజమానులు తెలిపారు.
News July 5, 2025
విశాఖలో ఏఐతో ఛలానాలు..!

విశాఖ సిటీలో ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలు చేయనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్క్ తెలిపారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ రామరాజు, ఇతర అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు సంస్థలు పైలట్ ప్రాజెక్టులు చేపట్టాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా అతివేగం, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలకు ఆటోమేటిక్ ఛలానా జారీ అవుతుందన్నారు.