News September 26, 2024
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణకు అస్వస్థత

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని సమాచారం. గురువారం తెల్లవారుజామున రాధాకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషనలో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
Similar News
News December 23, 2025
నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి: DMHO

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా మరింత కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ ఆదేశించారు. మంగళవారం మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ సేవలు, ప్రయోగశాల (ల్యాబ్), ఫార్మసీ, ప్రసవ గది తదితర విభాగాలను పరిశీలించారు.
News December 23, 2025
కృష్ణా: రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన మృత్యువు

చల్లపల్లి(M)లో హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పులిగడ్డ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న భాగ్యరాజు, రాఘవ ఆఫీస్ పనులు ముగించుకుని బైకుపై వెళ్తుండగా కారు ఢీ కొట్టింది. భాగ్యరాజు స్పాట్‌లో మృతి చెందగా, గాయపడిన రాఘవను VJAకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అక్టోబరులో భాగ్యరాజ్‌కు పెళ్లి కాగా, రాఘవ భార్య 4 నెలల గర్భిణి. ఈ ఘటన 2 కుటుంబాల్లో విషాదం నింపింది.
News December 23, 2025
సీఎం చంద్రబాబు సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ ఆవిష్కకరణ

సీఎం చంద్రబాబు సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ ఆవిష్కరించారు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో హైడ్రో & కెమికల్ రాకెట్రీ పోటీలు, ISRO గుర్తింపు పొందిన ముస్కాన్ ఎడ్యుకోమ్ & స్పేస్ కిడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. విజేతలకు రూ.1.5 లక్షల బహుమతులు, ఇంటర్న్‌షిప్, STEM & అంతరిక్ష అవకాశాలు ఉంటాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు తెలిపారు.


