News July 10, 2025
టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం పీహెచ్‌సీని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ 100 రోజుల యాజిక్యంపై సమీక్షించారు. టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ ప్రణీత, ఫార్మాసిస్ట్ ప్రపుల్ల, ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్ తదితరులున్నారు.
Similar News
News July 10, 2025
చాగల్లు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చాగల్లుకు చెందిన (59) శ్రీరంగం కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బుధవారం తెల్లవారుజామున రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి చాగల్లులో కృష్ణారావు మోపెడ్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు.
News July 10, 2025
చెట్లు లేకున్నా.. రసాయనాలతో ‘కల్తీ’ కల్లు!

TG: కూకట్‌పల్లిలో <<17003853>>కల్తీ కల్లు<<>> ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో తాటి, ఈత చెట్లు తక్కువే ఉన్నా ఒక్క HYDలోనే 100కు పైగా కల్లు కాంపౌండ్లు ఉన్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా కోసం ప్రమాదకర రసాయనాలతో కల్లు కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని సమాచారం. ఈ కల్లు నాడీ వ్యవస్థపై, కీలక అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
News July 10, 2025
గుంటూరులో గంజాయి అమ్ముతున్న యువకుల అరెస్ట్

గుంటూరు శివ నాగరాజు కాలనీలో గంజాయి విక్రయిస్తున్న గోపి, కార్తికేయలను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ లతా తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 253 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు షరీఫ్, తిరుమలేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.