News July 5, 2025

టీబీ నివారణపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, విద్య సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేసి క్షయ వ్యాధి నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News July 5, 2025

హత్యాయత్నం కేసు.. నిందితులకు 5 ఏళ్ల కఠిన కారాగారం

image

పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో జగిత్యాల అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి వెంకటమల్లిక్ నిందితులైన తోట నారాయణ (32), తోట మారుతి (35), ఆయన భార్య తోట జ్యోతికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1500/- చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

News July 5, 2025

HYD: ‘వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

image

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News July 5, 2025

పాడేరు: మెగా పేరెంట్స్&టీచర్స్ మీట్‌కు నిధులు విడుదల

image

అల్లూరి జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్స్&టీచర్స్ మీట్(పీటీఎం)కు రూ.3.05 కోట్లు విడుదలయ్యాయని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలిపారు. 30 మంది విద్యార్థులు ఉన్న స్కూల్‌కు రూ.10వేలు, 100 మంది ఉంటే రూ.25వేలు, 250 మంది ఉంటే రూ.50 వేలు, 500 మంది ఉంటే రూ.75 వేలు, 500కి పైబడి విద్యార్థులు ఉన్న స్కూల్స్‌కు రూ.లక్ష చొప్పున కేటాయించారన్నారు.