News March 23, 2025

టీబీ విభాగంలో భద్రాద్రికి రెండో బహుమతి

image

రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు 2024 ఏడాదికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతుల మీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ అవార్డు అందుకున్నారు.

Similar News

News July 6, 2025

PDPL: తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కుమారుడికి షాక్

image

ఓ వృద్ధ తల్లికి బుక్కెడు బువ్వ పెట్టకుండా ఆశ్రయం కల్పించని ఓ పుత్రరత్నం కేసు విషయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ కన్నతల్లి సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన కుమారుడు ఉంటున్న ఇంటిని నెలరోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ,సంరక్షణ బాధ్యతలు పూర్తిగా పిల్లలపైనే ఉంటుందన్నారు. ఈ మేరకు కొడుక్కి నోటీసులు పంపారు.

News July 6, 2025

ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన 598 సీట్లు

image

నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు త్రిపుల్ ఐటీ‌లో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంకా 598 సీట్లు మిగిలాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 139 సీట్లు, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 183 సీట్లు మిగిలాయి. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసేందుకు ట్రిపుల్ ఐటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 6, 2025

అరుణాచలంకు స్పెషల్ రైళ్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై)కు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్ల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. నరసాపురం-తిరువణ్ణామలై (నెం. 07219) రైలు జులై 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో కైకలూరు, గుడివాడ, విజయవాడలలో ఆగుతుంది.