News January 25, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్‌ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.
Similar News
News February 15, 2026
రేపు పాక్‌పై అభిషేక్ సునామీ!

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్‌పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్‌పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్‌రేట్‌తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్‌కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.
News February 15, 2026
ఐదుగురి ప్రాణదాతకు అరుదైన గౌరవం

కేరళలో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ అలిన్ షెరిన్(10 నెలలు)కు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానంతో ఐదుగురికి <<19136911>>ప్రాణం పోసిన<<>> ఆ పసికందుకు పోలీస్ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం విజయన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ బాలిక భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచుతారు. బగల్ సెల్యూట్(ఒక రకమైన వాయిద్య పరికరం)తో సహా పోలీసు గౌరవంతో అంతిమ యాత్ర నిర్వహిస్తారు.
News February 15, 2026
కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు

TG: కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని సీపీఐ-కాంగ్రెస్ అంగీకారానికి వచ్చాయి. తొలుత సీపీఐ నుంచి మేయర్, కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నర్సింహ నిర్ణయించారు.


