News February 7, 2026
టీమ్ ఇండియా హవా.. రెండేళ్లలో ఐదు ట్రోఫీలు

అంతర్జాతీయంగా వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్ ఇండియా హవా కొనసాగుతోంది. గత రెండేళ్లలో టీమ్ ఇండియా ఖాతాలో ఏకంగా 5 ICC ట్రోఫీలు చేరడమే దీనికి నిదర్శనం. 2024లో రోహిత్ సారథ్యంలోని భారత్ T20I వరల్డ్ కప్‌ను గెలుచుకోగా తర్వాతి ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక 2025లోనే U-19 T20WCను మహిళల జట్టు గెలుచుకోగా నవంబర్‌లో హర్మన్ సేన వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. తాజాగా U-19 మెన్స్ టీమ్ వన్డే WC గెలుచుకుంది.
Similar News
News February 19, 2026
ఉన్నది 3 శాతమే.. కానీ 50% పైగా కాలుష్యం!

ఇండియన్ రోడ్లపై తిరిగే వాహనాల్లో ట్రక్కుల సంఖ్య కేవలం 3 శాతమే. కానీ ఇవి దేశవ్యాప్తంగా 50% పైగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా పదేళ్లు పైబడిన పాత డీజిల్ వాహనాల వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఇవి 60% బ్లాక్ కార్బన్, 70% నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్‌కు కారణమవుతున్నాయి. 2030 నాటికి రవాణా రంగం ద్వారా వచ్చే కాలుష్యం 35%కి పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 19, 2026
మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <
News February 19, 2026
మహిళల్లో మైగ్రేన్‌కి ఎన్నో కారణాలు

మైగ్రెయిన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. అయితే మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు, మత్తుపానీయాలు, ధూమపానం అలవాట్లు ఇవన్నీ మైగ్రెయిన్ను ప్రేరేపిస్తాయంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.


