News April 8, 2025
టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News April 17, 2025
NZB: మంత్రి జూపల్లికి BRS జిల్లా అధ్యక్షుడి హెచ్చరిక

మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు మార్చుకోవాలని, లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవుని ఖబడ్దార్ అని BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు చేయాలని అడిగిన వారి మీదకు పోలీసులను ఉసిగొల్పి చితకబాదించడం ప్రజా పాలన అంటారా? అని ఆయన మండిపడ్డారు. పోలీసుల లాఠీచార్జికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
News April 17, 2025
ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్: NZB CP

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిజామాబాద్ CP సాయి చైతన్య వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారని పేర్కొన్నారు. ఇకపై మైనర్ల డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
News April 16, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రిలోని రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్‌కు సంప్రదించాలన్నారు.