News July 25, 2024
టీయూ పరిధిలో ప్రశాంతంగా పీజీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721907690224-normal-WIFI.webp)
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు 9వ రోజైన గురువారం ప్రశాంతంగా జరిగాయని టీయూ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అయితే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 187 మంది విద్యార్థులకు గాను 169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 18 మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు.
Similar News
News February 7, 2025
NZB: ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి: స్రవంతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738900521759_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు, ఫౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ కోసం ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 12నుంచి 14వరకు ఉంటుందన్నారు. వివరాలకు 86390 02255ను సంప్రదించాలన్నారు.
News February 7, 2025
NZB: ఫారెస్ట్ అధికారి హత్య.. దోషికి జీవిత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738861186745_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలో 2013లో ఇందల్వాయి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగయ్య దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆ కేసులో దోషిగా తేలిన భాస్కర్‌కు హైకోర్టు జీవిత కారాగార శిక్షను ఖరారు చేసింది. మిగతా 13 మందిని నిర్దోషులుగా పేర్కొన్నారు. కాగా 2017లో మొత్తం 17 మందిలో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News February 7, 2025
కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852778525_51940040-normal-WIFI.webp)
కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.