News January 30, 2025

టీయూ విద్యార్థులకు ALERT

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ సెంకడీయర్ మూడో సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్ష ఫీజ్ తేదీలను యూనివర్సిటీ వెల్లడించింది. ఫిబ్రవరి 8 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. రూ.100 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు చెల్లించే అవకాశం ఉందని పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌ లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

Similar News

News November 7, 2025

NZB: ఈ నెల 8 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

image

తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 9 వరకు సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్‌లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9550358444కు సంప్రదించాలన్నారు.

News November 7, 2025

నిజామాబాద్ జిల్లాలో సెక్షన్ 163 అమలు

image

టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 8 నుంచి 14 వరకు ఉదయం 8గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.

News November 6, 2025

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.