News November 20, 2025

టీయూ: వ్యవసాయ కళాశాలలో 30 అడ్మిషన్లు

image

టీయూకు కొత్తగా మంజూరైన వ్యవసాయ కళాశాలలో మొదటి సంవత్సరంలో 30 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. సౌకర్యాల లేమి కారణంగా హైదరాబాద్ వ్యవసాయ వర్సిటీలోనే మొదటి సెమిస్టర్ తరగతులు అక్కడే నిర్వహించనున్నారు. టీయూలో భవనాలు అందుబాటులో లేనందున సౌకర్యాల కల్పనకు టీయూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు వ్యవసాయ విద్య చేరువ కానుంది.

Similar News

News November 20, 2025

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు: కలెక్టర్

image

పేదల ఆకలిని తీర్చేందుకే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా తెలిపారు. పటమట హైస్కూల్ రోడ్డులోని అన్న క్యాంటీన్ ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ.5 చెల్లించి, అక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు. ఆహారం పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైనింగ్ ఏరియా, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాల పట్టిక, తాగునీటిని సరఫరాను చేశారు.

News November 20, 2025

MBNR: బీఈడీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి

image

పాలమూరు విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న బీఎడ్ కళాశాలల నాలుగో సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. గురువారం పీయూ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రవీణకు వినతిపత్రం అందజేశారు. ఫలితాలు విడుదల కాకపోవడంతో ఎంఈడీ కోర్సులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫలితాలు విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

News November 20, 2025

నటి మృతి.. అసలేం జరిగింది?

image

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్‌లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.