News February 25, 2025
టీసీ వరుణ్‌కు కీలక బాధ్యతలు

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అనంతపురం పార్లమెంట్‌కు టీసీ వరుణ్, హిందూపురం పార్లమెంట్‌కు చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. వీరు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని మార్చి 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
Similar News
News October 30, 2025
మహిళ సూసైడ్ అటెంప్ట్

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని శిరీషకు సూచించారు.
News October 29, 2025
అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
News October 29, 2025
గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.


