News February 9, 2026

టీ20ల్లో చెత్త రికార్డ్

image

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ శనక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇవాళ T20 WCలో ఐర్లాండ్‌పై డకౌటైన ఆయన టీ20ల్లో అత్యధిక(16) సార్లు సున్నాకే ఔటైన ప్లేయర్‌గా నిలిచారు. నేడు ఎదుర్కొన్న తొలి బంతినే షార్ట్ థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. టీ20Iల్లో ఇతని తర్వాత రువాండ జట్టుకు చెందిన జప్పీ(15), ఐర్లాండ్ కెప్టెన్ స్టెర్లింగ్(14) డకౌట్ అయిన లిస్టులో ఉన్నారు.

Similar News

News February 9, 2026

మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News February 9, 2026

కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఫీజులు పెంపు

image

దేశంలోని కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదుల ఫీజును న్యాయశాఖ పెంచింది. రెగ్యులర్ అప్పీళ్లకు హాజరై, తుది విచారణ వరకు వాదనలు వినిపించే గ్రూప్-ఏ న్యాయవాదులకు ఒక కేసుకు ఫీజు రూ.13,500 ఉండగా రూ.21,600 చెల్లించనుంది. గ్రూప్-బీ, సీ న్యాయవాదులకు రూ.9వేల నుంచి రూ.14,400 ఇవ్వనుంది. 11 ఏళ్ల తర్వాత ఈ ఫీజులు పెంచడం గమనార్హం.

News February 9, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.