News January 26, 2026
టీ20 వరల్డ్‌కప్ సమావేశంలో BCB ఛైర్మన్ అసహనం!

T20 WC విషయంలో ICCతో జరిగిన సమావేశంలో BCB ఛైర్మన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల సాకుతో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన విషయం తెలిసిందే. 3 వారాల పాటు చర్చలు సాగినప్పటికీ ఆ ప్రతిపాదనను ICC తిరస్కరించింది. చివరకు బంగ్లాను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో BCB ఛైర్మన్ అమినుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Similar News
News February 5, 2026
సిద్దిపేట: మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కూన శ్రీశైలం గౌడ్, దుబ్బాక మున్సిపల్- వనం శ్రీనివాస్, చేర్యాల మునిసిపాలిటీ-మెట్టు సాయి కుమార్, హుస్నాబాద్ మున్సిపాలిటీ- జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌లను నియమించారు.
News February 5, 2026
మున్సి‘పోల్స్’లో సోషల్ మీడియా వార్

TG: మున్సి‘పోల్స్’ ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు SMనూ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను INC మంత్రులకు, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించాయి. వీరి వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు సూచించాయి.
News February 5, 2026
మచ్చల్ని తగ్గించే జాజికాయ ఫేస్‌ప్యాక్

జాజికాయని వాడడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గడమే కాదు. మొటిమలు కూడా రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. 2 టీ స్పూన్ల జాజికాయ పొడి, తేనె, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఫేస్‌ప్యాక్‌ని క్లీన్ చేయండి. ఇలా చేస్తే ముఖం బ్రైట్‌గా కనిపిస్తుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. దీని వల్ల ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనె కూడా తొలగిపోతుందంటున్నారు.


