News December 1, 2025

టుడే హెడ్‌లైన్స్

image

❁ తెలంగాణను మూడు భాగాలుగా విభజిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్
❁ ఇండియన్ల వల్ల అమెరికా లబ్ధి పొందింది: మస్క్
❁ రేపటి నుంచే ప్రజాపాలన ఉత్సవాలు: భట్టి
❁ జగన్ హయాంలో ఇరిగేషన్ నాశనం: మంత్రి నిమ్మల
❁ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
❁ ఐబొమ్మ రవిని చంపితే మరో 100 మంది వస్తారు: CPI నారాయణ
❁ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ విజయం

Similar News

News March 28, 2026

‘సవాలక్ష’ అంటే ఏమిటి?

image

ఎక్కువ కష్టాలు, పనులు, సమస్యకు అనేక కారణాలున్నాయని చెప్పేందుకు ‘సవాలక్ష’ వాడతారు. ఈ పదానికి పలు రకాల విశ్లేషణలున్నాయి. భారతంలో లక్ష శ్లోకాలు ఉంటాయి. దానికి అనుబంధంగా ఉండే హరివంశంలో 24వేల శ్లోకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి సవాలక్ష అంటారని పండితులు చెబుతున్నారు. అలాగే ‘సవా’ అంటే ఉర్దూలో పావు(1/4) అని అర్థం. దీనిబట్టి సవాలక్ష అంటే 1,25,000 అని భాషా పండితులు చెబుతుంటారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 28, 2026

ఈ వింత చట్టాల గురించి తెలుసా?

image

*సింగపూర్‌లో 1992 నుంచి చూయింగ్ గమ్ వాడటం, దిగుమతి చేయడంపై నిషేధం
*జర్మనీలో పెట్రోల్ అయిపోయి రోడ్డుపై వాహనం ఆగిపోయినా నేరమే. డ్రైవర్ ముందే జాగ్రత్త పడాలి
*జపాన్‌లో అధిక బరువు ఉండటం చట్టవిరుద్ధం. కంపెనీలు తమ ఉద్యోగుల నడుము కొలతలను ఏటా చెక్ చేస్తాయి. కొలత ఎక్కువగా ఉంటే డైట్ పాటించాలి.
*థాయ్‌లాండ్‌లో డబ్బును తొక్కితే జైలు శిక్ష తప్పదు. కరెన్సీ నోట్లపై రాజు ముఖం ఉండటమే దీనికి కారణం

News March 28, 2026

IPL రికార్డ్స్.. ఈసారైనా బద్దలవుతాయా?

image

☛ ఒకే సీజన్‌(2016)లో కోహ్లీ రన్స్-973
☛ పుణే వారియర్స్‌పై గేల్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్-175*, ఫాస్టెస్ట్(30 బంతుల్లో) సెంచరీ, ఒకే ఇన్నింగ్సులో హయ్యెస్ట్ సిక్సులు-17
☛ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్(12 పరుగులిచ్చి 6 వికెట్లు.. అల్జారీ జోసెఫ్-MI)
☛ అత్యధిక టీమ్ స్కోర్- 287/3(SRH)
☛ ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం-229 రన్స్(2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ-ABD నెలకొల్పారు)