News December 18, 2025
టుడే హెడ్‌లైన్స్

✥ AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు: చంద్రబాబు
✥ ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల
✥ TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే డామినేషన్.. 2వేలకు పైగా స్థానాలు కైవసం
✥ ఐదుగురు MLAల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
✥ ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR
✥ దట్టమైన పొగమంచుతో భారత్-సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు
Similar News
News December 18, 2025
అధికారంలోకి రాగానే వారిని జైల్లో పెడతాం: జగన్

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తీసుకునేవారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ అంశంలో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. కోటి సంతకాల పత్రాలను కాసేపట్లో ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు.
News December 18, 2025
యాసంగిలో తగ్గిన ఉల్లి సాగు విస్తీర్ణం

TG: సరైన ధర, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, తగ్గిన దిగుబడి, పెరిగిపోతున్న సాగు ఖర్చు కారణంగా యాసంగిలో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాదిలో రబీలో కేవలం 5,200 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేస్తున్నారు. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలో కూడా ఉల్లి నాట్లు పడలేదు. గత ఏడాది కన్నా రబీ ఉల్లి సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ సీజన్‌లో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 2,601 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు.
News December 18, 2025
కలెక్టర్ల వినూత్న ఆలోచనలు… శభాష్ అన్న CM

AP: బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుపై కలెక్టర్లను CM CBN మెచ్చుకున్నారు. అల్లూరిలో ‘యాస్పిరేషన్ ఇంజిన్’తో STUDENTS మంచి మార్కులు సాధిస్తున్నారు. మన్యంలో ‘ముస్తాబు’తో స్టూడెంట్స్‌లో శుభ్రత మెరుగైంది. ‘మార్పు’తో అక్రమ మద్య రహితంగా ఏలూరు(D) మారుతోంది. స్మార్ట్ కిచెన్లకు అగ్రి లింకప్‌తో కడప స్కూళ్లకు మంచి ఆహారం అందుతోంది. ATPలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, NLRలో అగ్రి యాంత్రీకరణతో మేలు జరుగుతోంది.


