News December 24, 2025

టుడే హెడ్‌లైన్స్

image

*AP నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ గెలిస్తే రూ.100 కోట్లు: CM చంద్రబాబు
*TDP-JSP చెప్పినవి అబద్ధాలని RBI డేటాతో తేలింది: జగన్
*కొత్త సర్పంచులు మంచి పాలన అందించాలి: CM రేవంత్
*KCR గర్జిస్తే సమాధానం చెప్పే దమ్ము CMకి లేదు: KTR
*TGలో DEC 31 అర్ధరాత్రి వరకు వైన్స్, 1AM వరకు బార్స్
*భారత్‌లో 3 కొత్త ఎయిర్ లైన్స్: కేంద్రమంత్రి రామ్మోహన్
*శ్రీలంక ఉమెన్స్‌పై రెండో టీ20లో భారత్ ఘన విజయం

Similar News

News December 24, 2025

చైల్డ్ ట్రాఫికింగ్ కలకలం.. పిల్లల్ని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు!

image

తెలంగాణలో చైల్డ్ ట్రాఫికింగ్ కలకలం రేపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి HYDలో విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని అరెస్ట్ చేసి ఇద్దరు పిల్లల్ని రక్షించారు. ఈ ముఠా సభ్యులు సిటీలోని 8 ఆస్పత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో శిశువు విక్రయం ద్వారా ₹15L లావాదేవీలు జరిగినట్లు ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది.

News December 24, 2025

సీక్రెట్ శాంటా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా?

image

తుర్కియేలో 4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తికి సీక్రెట్ శాంటా ఆలోచన వచ్చింది. 1979లో లేరీ డీన్ స్టివర్ట్ అనే అమెరికన్ అవసరంలో ఉన్న వారికి డబ్బు సహాయం చేయడంతో ఈ కల్చర్ పాపులర్ అయింది. ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్‌గా ఉండే గిఫ్ట్ పాలసీ నేడు భారత్‌లోనూ ట్రెండ్‌గా మారింది. ఆఫీసుల్లో కొలీగ్స్ మధ్య సామరస్యాన్ని పెంచుతోంది. ఏది ఏమైనా ఎదుటి వారి మొహంలో కనిపించే నవ్వు నిజమైన గిఫ్ట్. మీరేమంటారు?

News December 24, 2025

ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్‌లో కీలక సమాచారం?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్‌ కీలకం అవుతోంది.