News October 27, 2025
టూత్ పేస్ట్ అనుకోని ఎలుకల మందు తిన్న చిన్నారి మృతి

బ్రష్ చేసుకుంటుండగా టూత్‌పేస్ట్‌గా భావించి ఎలుకల మందు తిన్న మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మం(D) సింగరేణి(M) గోవింద్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన చిన్నారి ధారావత్ మానస(3) ఈ నెల 17న ఎలుకల మందు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మొదట ఖమ్మం ఆసుపత్రికి, ఆపై HYDకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్ని: నటి ధన్య

కండీషన్లు పెట్టుకోవడం వల్లే తాను ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదగలేకపోయానని నటి ధన్య బాలకృష్ణన్ అన్నారు. రొమాంటిక్ సీన్లు చేయొద్దనే కండీషన్ పెట్టుకోవడంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ఆ సీన్లు చేసి ఉంటే మంచి పొజీషన్‌లో ఉండేదాన్ని అని పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. ఆమె నటించిన ‘కృష్ణలీల’ NOV 7న రిలీజ్ కానుంది.
News October 27, 2025
ఖమ్మంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు

ఖమ్మం జిల్లాలో 116 ఏ4 మద్యం షాపుల కేటాయింపును లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 4,430 దరఖాస్తులు అందగా, దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీశారు. రిజర్వేషన్ ప్రకారం గౌడలకు 18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 షాపులు కేటాయించారు. లాటరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 27, 2025
చీరాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం

చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మున్సిపల్ కమిషనర్ రషీద్ ఆర్డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చర్చించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.


