News March 17, 2025

టూరిజం స్పాట్‌గా పల్నాడు జిల్లా

image

జిల్లాల పునర్విభజనలో పలు కీలక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధి లోనికి రావటంతో పల్నాడు టూరిజం హబ్‌గా అభివృద్ధి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నాగార్జునసాగర్, ఎత్తిపోతల, పులిచింతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, గుత్తికొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తాయి. పల్నాడు కృష్ణానది పరివాహక ప్రాంతం కావడంతో టూరిజం స్పాట్ గా అభివృద్ధి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

Similar News

News January 3, 2026

OTTలోకి ‘అఖండ-2’.. ఎప్పుడంటే?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.120కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటించగా తమన్ సంగీతం అందించారు.

News January 3, 2026

పొగ మంచు ఎఫెక్ట్.. కోనసీమను తలపిస్తున్న వేములవాడ

image

దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వేములవాడ పట్టణం కోనసీమ అందాలను తలపిస్తోంది. తిప్పాపూర్ వేములవాడ మధ్యన ఉన్న బ్రిడ్జి, తిప్పాపూర్ లోని ప్రధాన బస్టాండ్ తదితర ప్రాంతాలు పొగమంచులో లీలగా మాత్రమే కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుండి ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బంది పడగా, మార్నింగ్ వాక్ కు వెళ్లినవారు ఈ ఆహ్లాద దృశ్యంతో ఆనంద పరవశులయ్యారు.

News January 3, 2026

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

image

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.