News December 30, 2025

టూరిజనికి కేరాఫ్ అడ్రస్‌గా పోలవరం

image

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా టూరిజంకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారనుంది. మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్లు, ఘాట్ రోడ్, గుడిసె హిల్ స్టేషన్, అమృతధార, జలతరంగిని జలపాతాలు,రంప జలపాతం, పాపికొండల బోట్ యాత్ర ప్రత్యేక ఆకర్షణగా, జిల్లాకు ఆదాయ వనరులుగా ఉండనున్నాయి. అలానే జిల్లాలో అనేక పురాతనమైన ఆలయాలు, మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

Similar News

News February 15, 2026

ఇవాళ ఓడితే నేపాల్, నమీబియా ఇంటికే?

image

ఇవాళ WCలో భారత్ vs పాక్‌తో పాటు మరో 2 మ్యాచులు జరగనున్నాయి. ఉ.11 గంటలకు వెస్టిండీస్, నేపాల్ తలపడనున్నాయి. ఇప్పటివరకు నేపాల్ 2 మ్యాచులు ఆడగా రెండింట్లోనూ ఓడింది. ఇవాళా ఓడిపోతే ఆ జట్టు దాదాపుగా ఎలిమినేట్ అయినట్లే. ఇక మ.3 గం.కు నమీబియా, USA మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు USA 3 మ్యాచుల్లో ఒకటి గెలిచింది. అటు నమీబియా రెండింట్లోనూ ఓటమిపాలైంది. ఇవాళ కూడా నమీబియా ఓడితే దాదాపుగా ఇంటిదారి పట్టినట్లే.

News February 15, 2026

ESIC వారణాసిలో 51 పోస్టులకు నోటిఫికేషన్

image

ESIC వారణాసి 51పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,23,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800,అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: esic.gov.in

News February 15, 2026

నంద్యాల: ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి

image

‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారిన రచయిత నందికొట్కూరు మండలం అల్లూరుకు చెందిన <<19145947>>శ్రీనివాస్<<>>(48) మృతిచెందారు. నిన్న ఆయన ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లా కూసుమంచి(M) పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ నీటిలో మునిగి మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానిస్తున్నారు.