News March 18, 2025

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

image

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

Similar News

News March 18, 2025

రాజకీయ పార్టీలతో శ్రీకాకుళం డీఆర్‌వో సమీక్ష

image

శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బూత్ స్థాయి అధికారులు నియామకాలు, పోలింగ్ బూత్‌లకు సంబంధించి అంశాలపై చర్చించి పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, తదితర వాటిపై సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

News March 18, 2025

ఎచ్చెర్లలో భార్య హత్య .. లొంగిపోయిన భర్త 

image

ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి కత్తితో నరికి హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం భార్యభర్తలిద్దరూ కలిసి ఉదయం కూలి పనికెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో హత్య చేశాడు. అనంతరం అప్పలరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.ఘర్షణకు కారణం తెలియాలి.

News March 18, 2025

కోటబొమ్మాళి: బంధువులకు విద్యార్థి అప్పగింత

image

కోటబొమ్మాళి మండలంలోని జగనన్న కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి ఆదివారం పరారైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌లో బాలుడి ఆచూకీ దొరికింది. వాట్సాప్ పోస్టుల ద్వారా ఓ వ్యాపారి బంధువులకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం విద్యార్థి పిన్ని వచ్చి తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు.

error: Content is protected !!