News October 6, 2025
టెక్కలిలో 50వేలు గాజులతో అలంకరణ

టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరుగట్టుపై ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో లలితా త్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి అమ్మవార్లకు 50వేలు గాజులతో సోమవారం అలంకరణ చేపట్టారు. గౌరీపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు తర్లా శివకుమార్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏటా గౌరీపౌర్ణమి నాడు గాజులతో అలంకరణ చేస్తున్నట్లు శివకుమార్ తెలిపారు.
Similar News
News October 6, 2025
సోంపేటలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

సోంపేట మండలం బారువ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చెశారు. అనంతరం వార్డెన్ రవికుమార్‌ను అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ తనిఖీలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి డీడీ మధుసూదనరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి పాల్గొన్నారు.
News October 6, 2025
శాంతించిన వంశధార..!

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.
News October 6, 2025
ఉద్దానంలో ఎయిర్‌పోర్ట్.. మీరేమంటారు?

ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే దానికి అనుబంధంగా 140సంస్థలు వస్తాయని.. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఫైలెట్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడంపై ఆలోచిస్తామన్నారు. రైతులకు నష్టం జరగకుండా భూములు తీసుకుంటామని.. కొన్నిపార్టీలు రైతులను అపోహలకు గురి చేస్తున్నారని గౌతు శిరీష అన్నారు. ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.