News April 9, 2024
టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి

టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీచేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేయగా.. కృపారాణి పేరు అందులో ఖరారైంది. వైసీపీని వీడిన ఆమె ఇటీవలే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తెలిసిందే.
Similar News
News December 12, 2025
రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఎరువులు సంబంధించి సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రటన విడుదల చేశారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 ఫోన్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 12, 2025
శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

జిల్లాలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖుర్దా రోడ్డు డివిజన్‌లోని రాజ్ అథ్‌గర్, జోరాండా రోడ్డు మధ్య 3వ, 4వ లైన్ల ప్రారంభోత్సవం దృష్ట్యా విశాఖ-అమృత్సర్-విశాఖ (20807/08), గుణుపూర్-రూర్కెలా-గుణుపూర్(18117/18) రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ దారి మళ్లింపు ఈనెల 12, 13, 14, 16, 17, 19, 20వ తేదీలలో అమలులో ఉంటుందని GM పరమేశ్వర్ తెలిపారు.
News December 12, 2025
శ్రీకాకుళం: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా విఠల్

కూటమి ప్రభుత్వం 13 జిల్లాల గ్రంథాలయ చైర్మన్‌లను గురువారం రాత్రి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పలాస నియోజకవర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ రావును నియమించింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.


