News January 31, 2025
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అధికారుల విచారణ

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో గురువారం అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఆసుపత్రిలో ఒక శిశువు తొడలో వ్యాక్సిన్ సూది ఉండిపోయిన ఘటనపై జిల్లా డీసీహెచ్ఎస్ డా.కళ్యాణ్ బాబు ఆదేశాల మేరకు నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీపాన శీనుబాబు విచారణ చేపట్టారు. విచారణలో సదరు సూది వ్యాక్సిన్ వేసిన ఇంజక్షన్ సూదిగా అధికారులు నిర్ధారించారు. తదుపరి చర్యలకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 25, 2025
పోలీసులు నేత్రాలను సంరక్షించుకోవాలి: ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి

పోలీసులకు కంటి చూపు చాలా ముఖ్యమని,కళ్లపై శ్రద్ధ వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరానికి చెందిన ఓ కంటి ఆసుపత్రి నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బందికి కంటి చూపు పరీక్షలు ఎస్పీ కార్యాలయంలో జరిగాయి. మానవ శరీరంలో కళ్లు అనే అవయవాలు చాలా ప్రధానమైనవని చెప్పారు. మన నేత్రాలను పరిరక్షించుకుని బాధ్యత వహించాలని అన్నారు.
News February 24, 2025
చౌకుపేటలో వివాహిత ఆత్మహత్య

సోంపేట మండలం చౌకుపేట గ్రామంలో సోమవారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కౌసల్య రౌలో (30) కుటుంబ సమస్యలు తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బారువా ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 24, 2025
SKLM: ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఉపాధ్యాయ MLC ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జెడ్పీ మందిరంలో ఈనెల 27న ఉపాధ్యాయ MLC ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఎపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.