News October 8, 2024

టెక్కలి: జ్వరంతో స్టాఫ్ నర్స్ మృతి

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీ(35)అనే మహిళ జ్వరంతో మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలిది నందిగం మండలం సుభద్రాపురం. స్టాఫ్ నర్స్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త మాధవరావు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Similar News

News December 21, 2025

సోంపేట: చెరువులను కాపాడాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

image

సోంపేట పట్టణంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు జడ్పీటీసీ సభ్యురాలు యశోద శనివారం వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాసపురం సర్పంచ్ టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.

News December 21, 2025

విశేష స్పందనతో జనవరి 3 వరకు సైకిల్ యాత్ర: SP

image

ప్రజల్లో విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పూర్తిగా నియంత్రణకు అభ్యుదయ సైకిల్ ఉపయోగపడుతుందని అన్నారు.