News January 29, 2025

టెక్కలి, పలాస బస్సులు దారి మళ్లింపు

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలాస, టెక్కలికి వెళ్లే బస్సులు రామలక్ష్మణ్ జంక్షన్ నుంచి పెద్దపాడు రోడ్డు మీదగా ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల సూచన మేరకు తాత్కాలికంగా బలగ జంక్షన్ నుంచి రాగోలు మీదుగా రాకపోకలు సాగిస్తాయని డిపో మేనేజర్ శర్మ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. యథాతథంగా రాకపోకలు సాగించేందుకు త్వరలో ప్రకటన విడుదల చేస్తామన్నారు. 

Similar News

News November 7, 2025

దర్శకుడిగా మన సిక్కోలు వాసి..!

image

మన శ్రీకాకుళం కుర్రాడు రాహుల్ దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం కానున్నాడు. సినిమాలపై మక్కువ, దర్శకుడు కావాలనే ఆసక్తితో చదువుతూనే మూవీ మేకింగ్ అంశాలను తెలుసుకున్నాడు. తొలుత వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం, సహాయ దర్శకుడిగా పదేళ్లు పని చేశాడు.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’(కామెడీ జోనర్) మూవీకి డైరెక్షన్ వహించగా, ఆ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది.

News November 7, 2025

శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

image

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.