News April 1, 2024

టెక్కలి: పోక్సో కేసు నమోదు

image

తన కుమార్తెను ఓ వ్యక్తి వేధిస్తున్నారంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి సీఐ పి. పైడయ్య ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళా డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానానికి బాలిక వచ్చి వెళ్తుండగా టెక్కలికి చెందిన యువకుడు వేధిస్తుండేవాడని, దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడియ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News April 21, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఫలితాలను https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడాలని చెప్పారు. డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.

News April 21, 2025

శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 154 వినతులు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వేదికైంది. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.

News April 21, 2025

ఎచ్చెర్ల: ఈ నెల 26న సీఎం పర్యటన .. స్థల పరిశీలన 

image

ఈ నెల 26న తేదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు స్థల పరిశీలన చేపట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి సీఎం హాజరుకానందున స్థల పరిశీలన చేశారు. వీరి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

error: Content is protected !!