News August 30, 2025

టెక్కలి: బావిలో డెడ్ బాడీ కలకలం

image

టెక్కలి అక్కపువీధిలోని నూతిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసరావు(40) శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఇంటికి సమీపంలోని బావిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 1, 2026

సీసీ కెమెరాలు నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్: ఆర్ఐవో

image

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు ఆర్ఐఓ సురేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 119 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 10 వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని, ప్రత్యేక కమిటీల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా పారదర్శకంగా పరీక్షలు పూర్తి చేస్తామన్నారు.

News February 1, 2026

కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన

image

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయ అధికారులు వివరాలు వెల్లడించారు. 2026-27 కేంద్ర బడ్జెట్ స్థిరమైన ఆర్ధిక విధానంతో పాటు పెట్టుబడులు, సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయం అన్నారు. నూతన ఆదాయపు పన్ను చట్టం, టూరిజం, డేటా సెంటర్లు ఏర్పాటు నిర్ణయాలు బాగున్నాయన్నారు.

News February 1, 2026

రణస్థలం: ‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’

image

లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలంలో ఆదివారం ఫిబ్రవరి 12 సమ్మె కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు మేలు చేసేందుకు లేబర్ కోడ్లను తెచ్చారని అన్నారు.