News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Similar News
News March 7, 2026
సంతబొమ్మాళి: ‘మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి’

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మరువాడ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు మంత్రి అచ్చెన్న నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయనకు కలిసి వినతి పత్రం అందజేశారు. సాగర్ మాల ప్రాజెక్టు కింద మత్స్యకార గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం, శాశ్వత తుఫాన్ రక్షిత భవనం నిర్మాణ చేయాలని కోరారు.
News March 6, 2026
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: గంజాయితో ముగ్గురు అరెస్ట్
➤శ్రీకాకుళం: వైసీపీ నియోజకవర్గ పరీశీలకుల నియామకం
➤ కొండములగాం సీహెచ్సీలో నాగుపాము హల్‌చల్
➤మందస: ఎవరు వస్తారు..దారి మనదే బాగుచేసుకోవాల్సిందే!
➤శ్రీకాకుళం జిల్లాలో “పది” పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
➤నందిగాం మండల కేంద్రంలో లేగదూడల ప్రదర్శన
➤పలాస: ‘ప్రభుత్వ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి’
➤ పోలాకి తీర గ్రామాల్లో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటు
News March 6, 2026
జడ్పీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకే!

ఏపీలోని 2021లో జిల్లాల పునర్విభజన జరగక మొత్తం 13 జిల్లాలోని మండలాలకు జడ్పీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2022లో 26 జిల్లాలుగా YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ఇటీవల 26ను..28 జిల్లాలుగా మార్చింది. గతంలో పాత జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళంలోని పది నియోజకవర్గాల్లో జరిగాయి. ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు జడ్పీ ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.


