News February 16, 2025

టెక్కలి: యువకుడి బ్రెయిన్‌డెడ్.. అవయవదానం

image

టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామానికి చెందిన మామిడిపల్లి సతీష్ (24) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు.. శనివారం యువకుడి నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.

Similar News

News February 19, 2025

మందస: పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

image

మందస మండలం లోహరిబంధలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం అనంతరం సమీపంలోని జీడీ తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News February 19, 2025

SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

image

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

News February 19, 2025

కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

image

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!